మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2023 (22:38 IST)

హైదరాబాద్‌లో ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి..

హైదరాబాద్‌లో వీధికుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా అత్తాపూర్‌-ఎన్‌ఎంగూడలో ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. బాలుడు వీధిలో నడిచి వెళ్తుండగా వెనుక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన శునకం అమాంతం అతడిపై దూకి దాడి చేసింది. ఈ ఘటనలో ఆ బాలుడు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. 
 
ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు ఏపీలోని కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోనూ నాలుగేళ్ల బాలుడిపై కుక్క దాడి చేసింది. స్వల్ప గాయాలతో బాలుడు చికిత్స పొందుతున్నాడు.