శుక్రవారం, 28 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (23:03 IST)

తెలంగాణలో రూ. 500 నోట్ల కోట్ల అవినీతి అనకొండ, పట్టేసిన ఏసిబి (video)

cash notes
జనం సొమ్ము దోచుకునే అవినీతి అనకొండలో ఏదో ఒకరోజు దొరికిపోతారు. అలాంటి ఘటనే తెలంగాణలో జరిగింది. తెలంగాణ విద్యుత్ శాఖకు చెందిన ఓ అధికారి నివాసంలో తవ్వేకొద్దీ రూ. 500 నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. ఆ అధికారి ఇంటిని సోదా చేసిన అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా ఎటు చూసినా డబ్బు కట్టలు దర్శనమిచ్చాయి.
 
దీనితో సదరు అధికారి ఎంతమంది ప్రజలను జలగలా పట్టుకుని పీల్చి పిప్పి చేసి అంత డబ్బు వెనకేశాడోనని జనం చెప్పుకుంటున్నారు. ఆయన నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. డబ్బు కట్టలు చూస్తుంటే ఓ మినీవ్యానులో సరిపడా డబ్బు వుందేమోననిపిస్తుంది.