Dharma Sangrah
✕

ఆదిలాబాద్ రైతులకు కనీస మద్దతు ధర.. పది సోయా సేకరణ కేంద్రాలు

Written By సెల్వి
Updated: శుక్రవారం, 9 అక్టోబరు 2026 (22:34 IST)
Soya
ఆదిలాబాద్ రైతులకు వారి పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అందేలా చూడటానికి, జిల్లా వ్యాప్తంగా 10 సోయా సేకరణ కేంద్రాలను తెరవనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం తెలిపారు. 
 
అధికారులతో సోయా పంట, దిగుబడిని సమీక్షించిన కలెక్టర్, ఆదిలాబాద్, జైనాడ్, బేలా, ఇచోడ, బోత్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, నేరేడిగొండలలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రాజర్షి షా చెప్పారు.
 
ఎంఎస్పీ పొందడానికి రైతులు తమ పంటను ఈ కేంద్రాలలో విక్రయించాలని రాజర్షి షా కోరారు. పంటకు సంబంధించిన చెల్లింపులు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అయ్యేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
ఈ సమావేశానికి జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, జిల్లా మార్కెటింగ్ అధికారి వై. గజానంద్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

రామాయణం సెట్స్‌లో సాయిపల్లవి కన్నీళ్లు.. ఎందుకో తెలుసా?

ప్రెగ్నెంట్ అయితేనేంటి? సినిమాలకు గుడ్ బై చెప్పేది లేదు.. టాక్సిక్ కుంగదీసింది..

రియాలిటీ లోని ‘భజ గోవిందం’ పాటకు గొప్ప ఆదరణ : కిరణ్ అబ్బవరం

హైందవ నుంచి సాయి శ్రీనివాస్, సంయుక్త, పై రొమాంటిక్ మెలోడీ రిలీజ్

ట్రెండ్ కు తగినట్లు ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టం : మాయలేడీ హీరో రాకేష్ వర్రే

తర్వాతి కథనం
Show comments