Daily Horoscope
✕

హైదరాబాదులో 35 కిలోమీటర్ల మేల డ్రైవర్లు లేని రవాణా విధానం

Written By సెల్వి
Updated: శుక్రవారం, 20 నవంబరు 2026 (14:10 IST)
Driverless Elevated Transport Network
హైదరాబాదులో కొత్త రవాణా విధానం అమలులోకి రానుంది. రైళ్లు, బస్సులు లేదా డ్రైవర్లు కూడా అవసరం లేని మరో ప్రజా రవాణా విధానం హైదరాబాద్‌కు త్వరలో అందుబాటులోకి రానుంది. తెలంగాణ ప్రభుత్వం, ప్రత్యేకంగా కేటాయించిన ఎలివేటెడ్ ట్రాక్‌లపై నడిచే చిన్న, డ్రైవర్‌లేని ఎలక్ట్రిక్ వాహనాలతో కూడిన 35 కిలోమీటర్ల పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తోంది.
 
ప్రతిపాదిత ఈ నెట్‌వర్క్ మొదటి దశ, రాయదుర్గం, బయోడైవర్సిటీ జంక్షన్ మీదుగా కూకట్‌పల్లిని నాలెడ్జ్ సిటీతో కలుపుతుంది. ఈ మార్గంలో 64 స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేస్తున్నారు. హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న తరుణంలో ఈ ప్రతిపాదన వచ్చింది. 
 
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్సార్టీసీ) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజూ సుమారు 30 లక్షల మంది ప్రయాణికులను రవాణా చేస్తుండగా, హైదరాబాద్ మెట్రో ప్రతిరోజూ దాదాపు 4.5-5 లక్షల ప్రయాణాలను నిర్వహిస్తోంది.
 
తాజాగా ప్రభుత్వ విస్తృత పట్టణ మొబిలిటీ ప్రణాళికలో భాగంగా, మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు, ఇతర రవాణా సేవలను అనుసంధానిస్తూ, ఈ ప్రతిపాదిత పీఆర్టీ నెట్‌వర్క్‌ను ఒక అదనపు రవాణా విధానంగా ప్రణాళిక చేస్తున్నారు.
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

నా బిడ్డపై నిరాధార ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు : 'యాక్షన్ కింగ్' అర్జున్

కన్నతల్లి అంత్యక్రియలకు చేతిలో చిల్లిగవ్వ లేదు.. అపుడు ఆమె ఆదుకుంది : ధన్‌రాజ్

Aakashamlo Oka Tara Review: స్పూర్తి కలిగించేదిగా ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ

స్టేజిపై హీరోయిన్‌కు ముద్దు పెడతానంటూ దగ్గరకు లాక్కున్న హీరో, అంత బలుపా అంటూ ట్రోల్స్

మూస చిత్రాలకు భిన్నంగా రాజిగాడు రాజయ్యాడు, టీజర్ లాంఛ్

తర్వాతి కథనం
Show comments