గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2024 (13:05 IST)

కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు... తానే ఒక చరిత్ర పేరిట డాక్యుమెంటరీ

KCR
KCR
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. శనివారంతో 70వ ఏట కేసీఆర్ అడుగు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. 
 
ఇటీవలే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నల్లగొండ సభలో పాల్గొన్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు రక్తదాన శిబిరాలతో పాటు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శనివారం గ్రేటర్‌ వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మాగంటి గోపీనాథ్‌ తెలిపారు. 
 
పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన కేసీఆర్‌ రాజకీయ ప్రస్థానం, ఉద్యమ నేపథ్యంలో 30 నిమిషాల వ్యవధితో కూడిన ‘తానే ఒక చరిత్ర’ పేరుతో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ఈ వేడుకల సందర్భంగా ప్రదర్శించనున్నారు.