ఆదివారం, 11 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2025 (16:25 IST)

హైదరాబాద్ సిటీ కాలేజీలో పైథాన్ కలకలం.. (వీడియో)

rock python
హైదరాబాద్ నగరంలోని సిటీ కాలేజీ ప్రాంగణంలో పైథాన్ కనిపించగా, దీన్ని చూసిన స్థానికులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. పాతబస్తీ ప్రాంతంలోని హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్‌ పరిధిలోని సిటీ కాలేజీ ప్రాంతంలో జనావాసాల మధ్య రాక్ పైథాన్ జాతికి చెందిన కొండ చిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 
 
ఈ కొండ చిలువను గుర్తించిన స్థానికులు వెంటనే వన్యప్రాణి సంరక్షకుడు సయ్యద్ తాకీ అలీ రిజ్వీకి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రిజ్వీ చాకచక్యంగా కొండ చిలువను బంధించారు. ఆయన ఆ కొండ చిలువను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అటవీ శాఖ అధికారులు దానిని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.