సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 24 ఫిబ్రవరి 2024 (18:15 IST)

లాస్యకు ఎమ్మెల్యే పదవి అచ్చి రాలేదా? శరీరానికి 12 తాయెత్తులు, మృత్యుభయంతో చివరికి...

lasya nanditha
రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు అసలు ఎమ్మెల్యే పదవి కలిసి రాలేదేమోనన్న వాదనలు వస్తున్నాయి. సహజంగానే సమాజంలో ఎన్నో విశ్వాసాలు వుంటాయి. ముఖ్యంగా కొత్త ఇల్లు కట్టినా, కొత్త కారు కొనుగోలు చేసినా ప్రమాదాలు చోటుచేసుకుంటే వెంటనే శాంతిపూజలు చేయించడమో లేదంటే కొనుగోలు చేసిన దాన్ని వదిలివేయడమో జరుగుతుంది. ఇప్పుడు అలాంటిదే లాస్య విషయంలో జరిగిందేమోనన్న వాదన వినిపిస్తోంది.
 
ఎందుకంటే... లాస్య ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఆమెను ప్రమాదాలు వెంటాడాయి. ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొద్దిరోజులకే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత లిఫ్టులో ఇరుక్కున దాదాపు 3 గంటల పాటు ప్రాణభయంతో గడిపారు. చివరికి సురక్షితంగా బయటపడ్డారు. ఇక మూడోసారి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు.
 
కాగా వరుస ప్రమాదాలు జరగడంతో ఆమె మృత్యుభయం తొలగిపోవాలని పలు ఆలయాలకు, బాబాల వద్దకు తరచూ వెళ్తున్నట్లు తేలింది. పూజలు, ప్రార్థనలు చేస్తూ తాయత్తులు కట్టించుకున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన రోజు నాడు ఆమె తాయత్తు కోసమే సదాశివపేట మండలంలో వున్న ఓ దర్గాకు వెళ్లారట. తాయత్తును కట్టించుకుని తిరిగి వస్తూ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పుకుంటున్నారు. ఐతే ఆమె ఎమ్మెల్యే పదవిని వదులుకుంటే బ్రతికి బయటపడేవారని మరికొందరు చెప్పుకుంటున్నారు.
 
కాగా ఆమె మృతదేహంపై 12 తాయత్తులను వైద్యులు గుర్తించడాన్ని బట్టి ఆమె ఇటీవలి కాలంలో ఆలయాలు, దర్గాలను దర్శించినట్లు తెలుస్తోంది.