ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2024 (17:08 IST)

యాచకుడిని కాలితో తన్నిన డిప్యూటీ ఎమ్మార్వో.. టిప్పర్ టైర్ కింద పడి?

Deputy Tehsildar Rajasekhar
Deputy Tehsildar Rajasekhar
ఆర్మూర్‌లో డిప్యూటీ ఎమ్మార్వో రాజశేఖర్ ఓవరాక్షన్ చేశారు. వివరాల్లోకి వెళితే... ఆర్మూర్ - మామిడిపల్లి చౌరస్తా వద్ద సిగ్నల్ పడిన సమయంలో డిప్యూటీ ఎమ్మార్వో రాజశేఖర్ కారు ఆగింది. శివరాం (32) అనే యాచకుడు కారు అద్దాలు తుడిచి డబ్బులు అడగగా లేవని కారు ముందుకు కదిలించాడు. 
 
అంతేగాకుండా డబ్బుల కోసం వెంట పడగా కోపంతో కాలితో తన్నాడు. ఈ ఘటనలో పక్క నుండి వెళ్తున్న టిప్పర్ వెనక టైర్ కింద పడి శివరాం అక్కడికక్కడే మృతిచెందాడు. రాజశేఖర్ మీద పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో శివరాం కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.