బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జూన్ 2024 (15:37 IST)

రీల్స్ పిచ్చి.. మెడకు ఉరి బిగించుకుని రీల్స్.. నిజంగానే ఉరేసుకున్నాడు..

hang
రీల్స్ పిచ్చికి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. మెడకు ఉరి బిగించుకుని రీల్స్ చేసే క్రమంలో అది మెడకు బిగుసుకుపోవడంతో మరణించాడు. 
 
నర్సంపేటలోని ఓ గ్రామానికి చెందిన కందకట్ల అజయ్ (23) హోటల్‌లో పనిచేస్తుంటాడు. రీల్స్ చేసి వాటిని తన ఖాతాలో షేర్ చేసే అలవాటున్న అజయ్ రెండ్రోజుల క్రితం మల్లంపల్లి రోడ్డులోని తన చిన్నక్క ఇంటికి వచ్చాడు.
 
అక్కడ ఉరివేసుకుంటున్నట్టుగా వీడియో చిత్రీకరించాలని అనుకున్నాడు. దూలానికి ఉరి ఏర్పాటు చేసి ఫోన్‌ను ఫ్రిడ్జ్‌పై పెట్టాడు. వీడియో చిత్రీకరించే సమయంలో ఉరి నిజంగానే మెడకు బిగుసుకుపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.