ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (08:42 IST)

వర్క్‌స్పేస్ వీడియో క్రియేషన్ టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన గూగు్ల్!!

google vids
గూగుల్ ఏఐ ఆధారిత వర్క్‌స్పేస్ వీడియా క్రియేషన్ టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమవారం జరిగిన క్లౌడ్ నెక్స్ట్-2024 ఈవెంట్‌లో ఈ టూల్‌ను పరిచయం చేసింది. రీక్యాప్ వీడియాలు, అనౌన్స్‌మెంట్ వీడియోల రూపకల్పనకు అవకాశం ఉంటుంది. డాక్స్, షీట్స్, స్లయిడ్ వంటి గూగుల్ టూల్స్‌తో పాటు పర్పుల్ డాక్యుమెంట్ ఐకాన్‍‌తో ఇది అందుబాటులో ఉంది. ఐకాన్ మధ్యలో ప్లే బటన్‌తో కనిపిస్తుంది. ఈ టూల్‍‌‌ని ఉపయోగించి రీక్యాప్ వీడియోలు, అనౌన్స్‌మెంట్ వీడియోలు, ట్రైనింగ్ రీల్స్‌తో పాటు మరిన్ని వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్ ఇంటర్‌ఫేస్‌తో గూగుల్ దీనిని రూపొందించింది. ఇతరులకు షేర్ చేయడంతో పాటు వీడియో మేకింగ్ సహకారాన్ని కూడా ఏర్పరచుకోవచ్చు. 
 
హెల్ప్ మీ క్రియేట్ ఏ వీడియో ఆప్షన్‌పై క్లిక్ చేసి వీడియో క్రియేషన్‌ను యూజర్లు ప్రారంభించవచ్చు. వీడియో దేనికోసం ఏ కేటగిరి వ్యూయర్స్ కోసం వంటి ఆలోచనలతో పాటు వీడియో సైజుని సూచించాలి. ఆ తర్వాత ఎట్ ది రేట్‌న (@) టైప్ చేసి గూగుల్ డ్రైవ్‌లోని ఫోటోలను అటాచ్ చేయొచ్చు. ఏఐ ఆధారిత ఎడిటింగ్‌కు అవకాశం ఉంటుంది. క్వాలిటీ ఫోటోలు, వీడియోలు, సౌండ్ ఎఫెక్ట్స్ల్‌ను యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదు వాయిస్ ఓవర్ ప్రాసెస్‌‍ కోసం రికార్డింగ్ స్టూడియో ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రీసెట్ వాయిస్‌ను ఎంచుకునేందుకు వీలుంటుంది.