గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: శుక్రవారం, 25 జూన్ 2021 (20:35 IST)

నకిలీ ఈమెయిల్‌తో 55 లక్షల మోసం

నకిలీ ఈమెయిల్‌తో 55 లక్షల మోసం చేసారు కేటుగాళ్లు. మసాబ్ ట్యాంక్ కు చెందిన నిమ్రా సెర్ గ్లాస్ టెక్నాలజీస్ సంస్థ ఎండీ ని తప్పుదోవ పట్టించి యాభై మూడు లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు.
 
మెటీరియల్ కొనుగోలు కోసం ఒక ఇంటర్నేషనల్ సంస్థతో నిమ్రా సంస్థ యజమాని ఖాదర్ ఒప్పందం. డాలర్ల రూపంలో అడ్వాన్స్ మొత్తం ట్రాన్స్ఫర్. రెండవ విడత చెల్లింపు సమయంలో ఖాదర్ ని ట్రాప్ చేసిన కేటుగాళ్లు.
 
సంస్థ అధికారులమని డబ్బును లండన్ లో ఉన్న వేరే బ్యాంకు ఖాతాకు పంపించాలని స్పూఫ్ ఈ మెయిల్ చేసిన కేటుగాళ్లు. 53 లక్షల 23వేలు ట్రాన్స్ ఫర్ చేసిన ఖాదర్. సంస్థ అసలు  అధికారులను సంప్రదించడంతో బయటపడిన మోసం. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్‌లో బాధితుడు ఖాదర్ ఫిర్యాదు.