Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

హైదరాబాద్‌లో కరోనాతో 7రోజుల పసికందు మృతి

Written By ఎం
Updated: బుధవారం, 27 మే 2020 (21:27 IST)
తెలంగాణలో కరోనా మహమ్మారి జడలు విప్పుకుంటోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో బుసలు కొడుతున్న కరోనా చిన్నారులను బలితీసుకుంటోంది. కరోనా బారిన పడి హైదరాబాద్‌లో ఏడు రోజుల పసికందు మృతి చెందింది. తల్లికి కరోనా లేకుండా బిడ్డకు వ్యాధి సోకి మరణించడం తీవ్ర కలకలం రేపింది.
 
తెలంగాణలో కరోనా మహమ్మారి జడలు విప్పుకుంటోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో బుసలు కొడుతున్న కరోనా చిన్నారులను బలితీసుకుంటోంది.

కరోనా బారిన పడి హైదరాబాద్‌లో ఏడు రోజుల పసికందు మృతి చెందింది. తల్లికి కరోనా లేకుండా బిడ్డకు వ్యాధి సోకి మరణించడం తీవ్ర కలకలం రేపింది.

అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా సోకి ఇంత తక్కువ వయసులో చనిపోవడం ఇదే తొలిసారి. వివరాల్లోకి వెళితే..
కుత్భుల్లాపూర్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల నిలోఫర్ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది.

తల్లి బిడ్డ, క్షేమంగా ఉండటంతో వారిని డిశ్చార్జీ చేశారు. ఆ తర్వాత చిన్నారి అనారోగ్యానికి గురి కావడంతో పరీక్షలు జరపగా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ప్రసవానికి ముందే తల్లి, బిడ్డకు కరోనా పరీక్షలు చేశారు. 
 
వారి కుటుంబంలో కూడా ఎవరికి కరోనా లక్షణాలు లేవు. ఈ క్రమంలో ఆస్పత్రిలోనే ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. శిశువు ఉన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.

ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నవారిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ మాత్రం వైరస్ లక్షణాలు కనిపించినా, అనుమానం కలిగినా వైద్యులను సంప్రదించాలని సూచించారు.

అన్నీ చూడండి

Anupama Parameswaran: థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న క్రేజీ కల్యాణం మూవీ

Teja Sajja: ది ట్రెయిటర్స్ తెలుగు ట్రైలర్‌ రావడం ఆనందంగా ఉంది: హీరో తేజ సజ్జ

కామ్రేడ్ కళ్యాణ్ ప్రేమతో పడితే ఏమయిందనే పాయింట్ తో ట్రైలర్ రిలీజ్

NBK 111: దాదా- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ

Anil ravipudi: స్నేహితుల కథతో సరిపోయారు ఇద్దరూ టీజర్ విడుదల

తర్వాతి కథనం
Show comments