బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 మే 2021 (15:27 IST)

లాయర్ దంపతుల హత్య : పుట్టా మధు అరెస్టు.. హత్యకు ముందు రూ.2 కోట్లు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్టా మధును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వద్ద గత రెండు రోజులుగా విచారణ జరుపుతున్నారు. 
 
అలాగే, ఈ కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. పుట్టా మధు మేనల్లుడు బిట్టు శ్రీనుకు కారు సమకూర్చడం.. లాయర్ హత్యకు ముందు రూ.2 కోట్లు ఎందుకు డ్రా చేశారనే కోణంలో విచారిస్తున్నారు. ఆ సొమ్ము ఎవరికి ఇచ్చారనే దానిపై ఆరా తీస్తున్నారు. 
 
మరో నిందితుడు కుంటా శ్రీను నిర్మిస్తున్న ఇల్లుకు ఎవరు డబ్బులు ఇచ్చారనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి పుట్టా మధును మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే అవకాశం ఉంది. ఇక వామన్ రావు హత్యకేసులో ఓ మాజీ మంత్రి పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. పుట్టా మధుకు ఆ మంత్రి పూర్తిగా సహకరించారనే ప్రచారు జోరుగా సాగుతోంది.