మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 మే 2021 (13:13 IST)

తెలంగాణలో ఒక్కసారిగా భారీగా తగ్గిన కరోనా కేసులు

తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా భారీగా తగ్గిపోయాయి. వార రోజుల క్రితం వరకు దాదాపు 8 వేలకు నమోదైన కేసులు ఇప్పుడు 5 వేలకు చేరాయి. తాజాగా నమోదైన కేసులు 5,186 కాగా, 38 మరణాలు సంభవించాయి. 24 గంటల్లో 7,994 మంది చికిత్స పొందుతూ డిశ్చార్జ్‌ అయ్యారు. 
 
మరోవైపు, తెలంగాణ వైద్యారోగ్య శాఖ మళ్లీ సాయంత్రం పూట కరోనా బులెటిన్‌ విడుదల చేయడం ప్రారంభించింది. శనివారం వరకు ఉదయం విడుదల చేస్తుండగా తాజాగా సాయంత్రానికి మార్చారు. తాజాగా శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో ఒక్క రోజులో 69,148 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు చేసిన కరోనా పరీక్షలు 1,35,57,646. కరోనా నుంచి కోలుకున్నవారు.
 
మొత్తం 4,21,219 మంది ఉండగా, రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 68,462. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 4,92,385. మొత్తం మృతుల సంఖ్య 2,704. అత్యధికంగా హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో కేసులు నమోదవుతున్నాయి. అత్యల్పంగా కొమురం భీం ఆసిఫాబాద్‌, నారాయణపేట జిల్లాలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి.