సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 మే 2021 (11:02 IST)

దేశంలో కొత్తగా 4,01,078 కరోనా కేసులు, 4,187 మంది మృత్యువాత

దేశంలో కరోనా కలకలం రేపుతుంది. చైనాలో పుట్టి ప్రపంచ దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో జనాలు నానా తంటాలు పడుతున్నారు. దేశంలో కొత్తగా 4,01,078 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,18,92,676 కి చేరింది. 
 
ఇందులో 1,79,30,960 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,23,446 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 4,187 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,38,270 కి చేరింది. 
 
ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,18,609 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే, దేశంలో ఇప్పటి వరకు మొత్తం 16,73,46,544 మందికి వ్యాక్సిన్ అందించారు.