గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 మే 2021 (20:57 IST)

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు.. ఉరుములు, మెరుపులు..?

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే మూడు రోజుల్లో పలుచోట్ల వర్షాలు పడనున్నాయి. 
 
ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. 
 
ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగండ్లు పడనున్నాయి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురవనుంది. ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఒకచోట.. రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
 
ఇప్పటికే ఆదిలాబాద్‌, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌ తదితర జిల్లాల్లో వర్షం కురిసింది. అలాగే వికారాబాద్‌ జిల్లా మొయిన్‌పేటలో 31.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.