బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Updated : బుధవారం, 26 డిశెంబరు 2018 (13:45 IST)

పాపం భార్యకు ఇలా దొరికిపోయాడు ఆ సాఫ్ట్‌వేర్ టెక్కీ...

అగ్నిసాక్షిగా తాళికట్టి మరో యువతితో కులుకుతున్న భర్త బాగోతాన్ని బయటపెట్టింది ఓ ఇల్లాలు. భార్యను, కన్న కూతుర్ని వదలి మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న సాఫ్ట్వేర్ భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది అమూల్య. తాజాగా ఈ ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్వారక నగర్లో చోటుచేసుకుంది. 
 
అమూల్య తెలిపిన వివరాల ప్రకారం నకిరేకల్‌కు చెందిన నాగరాజుతో 2007లో పెద్దల సమక్షంలో విహహం జరిగింది. వీరికి అన్విక అనే 8 సంవత్సరాల పాప కూడా ఉంది. నాగరాజు టీసిఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలో "టీమ్ లీడర్" గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న"రాధారాణి" అనే యువతితో గత ఆరు నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ హస్తినపురం ద్వారక నగర్లో వేరే కాపురం పెట్టాడు.
 
విషయం తెలుసుకున్న అమూల్య వారీద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని మీర్ పేట్ పోలీసులుకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గతంలో కూడా తనను వదిలించుకోవడానికి తనను, తన కూతురిని హత్య చేయడానికి పథకం పన్నాడని ఫిర్యాదులో తెల్పింది బాధితురాలు. తనకు, తన కూతురికి తన భర్త నాగరాజుతో ప్రాణ హాని ఉందని, తన భర్తపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని, తనకు తన కూతురికి న్యాయం చేయాలని అమూల్య పోలీసులను వేడుకొంది.