ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (14:17 IST)

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ.. అవన్నీ అబద్ధాలే

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ రాసిన లేఖ అబద్ధాలతో కూరుకుపోయిందని చెప్పారు. ఆ లేఖ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వుందని సంజయ్ ఫైర్ అయ్యారు. 
 
సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల అనుసరిస్తున్న విధానాల వల్ల సంతోషంగా సంక్రాంతి పండుగను చేసుకోవాల్సిన రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు నేడు కన్నీళ్ళతో సకినాల పిండిని తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని బండి సంజయ్ పేర్కొన్నారు. 
 
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని నిరుద్యోగుల పక్షాన మహోద్యమానికి శ్రీకారం చుట్టామని బండి సంజయ్ పేర్కొన్నారు. 
 
రాష్ట్రంలో బిజెపి చేస్తున్న ఉద్యమం ద్వారా ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసి ప్రజల మైండ్ డైవర్ట్ చేశాడని, తద్వారా కొత్త డ్రామాకు తెరతీశారు అని బండి సంజయ్ బహిరంగ లేఖ ద్వారా పేర్కొన్నారు. 
 
ఏప్రిల్ 13న ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర రైతాంగానికి ఉచితంగా ఎరువులను సరఫరా చేయాలని బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలన్నారు.