Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కేసీఆర్‌కు ఆ భ‌యం పట్టుకుంది.. ఎన్ని జిమిక్కులు చేసినా?

Written By సెల్వి
Updated: సోమవారం, 7 మార్చి 2022 (20:07 IST)
కేసీఆర్‌కు ఓడిపోతాన‌నే భ‌యం ప‌ట్టుకుంది. అందుకే బీజేపీ కార్య‌కర్త‌ల‌పై దాడులు, నాయ‌కుల‌పై త‌ప్పుడు కేసులు పెడుతూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఫైర్ అయ్యారు. అందుకే రాష్ట్రంలో ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని విజయశాంతి మండిపడ్డారు. 
 
కేసీఆర్‌కు ఓడిపోతాన‌నే భ‌యం ప‌ట్టుకుందని ఆమె ఎద్దేవా చేశారు. ప్రతిరోజూ పూర్తి స్థాయిలో రిపోర్టు ఇవ్వాలని అటు ఇంటెలిజెన్స్‎కు, ఇటు డిపార్ట్‎మెంట్లకు కేసీఆర్ సర్కార్ నుంచి ఇంటర్నల్ ఆదేశాలు వెళ్లాయని రాములమ్మ చెప్పారు. 
 
ఈ ఆదేశాలు చూస్తే కేసీఆర్ మ‌ళ్లీ అధికారంలోకి రాడని తేలిపోయిందన్నారు. అందుకే అధికారుల‌ను ఉప‌యోగించుకుని అధికారం నిల‌బెట్టుకోవాల‌ని చూస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. 
 
"కేసీఆర్... నువ్వెన్ని రిపోర్టులు తెచ్చుకున్నా... ఎన్ని జిమ్మిక్కులు చేసినా... నీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజానీకం బంగాళాఖాతంలో కలప‌డం ఖాయం." అని విజయశాంతి హెచ్చరించారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments