Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ సిద్ధం...

Written By సెల్వి
Updated: ఆదివారం, 21 ఆగస్టు 2022 (12:54 IST)
తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది. మునుగోడు బహిరంగ సభతో తెలంగాణలో అధికార పీఠానికి మార్గం సుగమం చేసుకోవాలని కమలనాథులు యోచిస్తున్నారు. ఇక మునుగోడు సభలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని ప్రచారం సాగుతోంది. 
 
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బీజేపీ సభకు రానున్న అమిత్‌ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగసభను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు జరిగాయి. కాగా.. అమిత్ షా మునుగోడు షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. 
 
మధ్యాహ్నం 2 గంటలకు స్పెషల్ ఫైయిట్‌లో ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. బేగంపేట్‌ నుంచి నేరుగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం బేగంపేట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మునుగోడుకు వెళ్లనున్నారు అమిత్ షా. 
 
సభ అనంతరం మునుగోడు నుంచి రోడ్డు మార్గన హైదరాబాద్‌లోని నోవాటెల్‌కు చేరుకుంటారు. తిరిగి రాత్రి 10 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

అన్నీ చూడండి

Santosh Shoban: మల్టీవర్స్ కామెడీగా సంతోష్ శోభన్ చిత్రం సత్తిబాబు పరలోక యాత్ర లుక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10‌: ఛాన్స్ వచ్చింది కానీ.. అమ్మ కోసం వెళ్లలేదు.. సుప్రిత

Sampoornesh Babu :నా కెరీర్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి - .అయినా రెమ్యూనరేషన్ పరంగా హ్యాపీ : సంపూర్ణేష్ బాబు

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం, దేవిక భట్ జంటగా KA13 స్పెషల్ పోస్టర్‌

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

తర్వాతి కథనం
Show comments