శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

బండి సంజయ్ పాదయాత్ర : బీజేపీ - తెరాస కార్యకర్తల ఘర్షణ

trs vs bjp fight
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామం పేరుతో కొనసాగిస్తున్న పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, తెరాస కార్యకర్తలు మధ్య ఘర్షణ నెలకొంది. సంజయ్ ప్రసంగిస్తుండగా ఈ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. 
 
ప్రస్తుతం ఈ పాదయాత్ర జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా దేవరుప్పలలో బండి సంజయ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఒక్కరంటే ఒక్కరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పారు. 
 
దీంతో అక్కడున్న కొందరు తెరాస కార్యకర్తలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందంటూ బండి సంజయ్‌ను నిలదీశారు. ఇది ఇరు పార్టీల మధ్య ఘర్షణకు దారితీసింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతపరిచారు.