టచ్‌లో 50 మంది తెరాస ఎమ్మెల్యేలు : బండి సంజయ్
తెరాస గడీ బద్ధలు కొట్టే సమయం ఆసన్నమైందని, ఆ పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరి, ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
శనివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ఇంతకాలం కాంగ్రెస్, టీఆర్ఎస్‌కు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలు.. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు తథ్యమన్నారు.