బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 ఆగస్టు 2022 (11:11 IST)

సొంత పార్టీ ఎంపీకి సారి చెప్పిన రేవంత్ రెడ్డి

revanth reddy
తమ సొంత పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పారు. కోమటిరెడ్డికి బహిరంగంగా సారీ చెబుతున్నా... ఇలాంటి చర్యలు, ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమం, సాధనలోకీలక పాత్ పోషించిన కోమటిరెడ్డికి ఇలా అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా తగదని, తదుపరి చర్యల కోసం క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ చెన్నారెడ్డికి రేవంత్ రెడ్డి సూచించారు. ఇదే అంశంపై రేవంత్ రెడ్డి ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. 
 
కాగా, ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జరిగిన ఓ బహిరంగ సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అదే పార్టీకి చెందిన సీనియర్ నేత అద్దంకి దయాకర్ పరుష పదజాలంతో దూషించారు. దీనిపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో అద్దంకి దయాకర్ కాకుండా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిగివచ్చిన బహిరంగ క్షమాపణలతో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.