ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 ఆగస్టు 2022 (14:01 IST)

జనగామలో ప్రేమ జంట సెల్ఫీ సూసైడ్

lovers suicide
తెలంగాణ రాష్ట్రంలో జనగామలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట సెల్ఫీ ఆత్మహత్య చేసుకుంది. ఈ జంట బలవన్మరణానికి పాల్పడేముందు సెల్ఫీ వీడియో తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 
 
పాలకుర్తి మండలం బిక్యానాయక్ తండాలో వెలుగు చూసిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే... బిక్యానాయక్ తండాకు చెందిన గగులోతు రాజు (20), బానోతు దీపిన (16) అనే యువతీ యువకులు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని భావించారు. దీనికి ఇరు కుటుంబాల పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు. 
 
దీంతో మనస్తాపానికు గురైన ఈ జంట... తీవ్రమనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలోనే వారిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకుని, పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే, దురదృష్టవశాత్తు ప్రియుడు ప్రాణాలు కోల్పోగా, ఆ యువతి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.