ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 మార్చి 2023 (12:03 IST)

గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుపోయి బాలుడు మృతి

coconut
గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుపోయి పసిపిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంపెద్ద కొర్పోలు గ్రామ శివారు వెంకట్‌తండాలో ధారావత్ మాలు, కవిత దంపతులకు మణికంఠ అనే ఏడాది బాబు వున్నాడు. 
 
అయ్యప్పమాల వేసుకున్న ధారవత్ మాలు.. పూజ కోసం గుడికి వెళ్లాడు. కవిత ఇంటి పనిలో వుండగా మణికంఠ కొబ్బరి ముక్క తిన్నాడు. అది గొంతులో ఇరుక్కుపోయి శ్వాస ఆడలేదు. 
 
ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చిన్నారి మృతి చెందాడు. కళ్ల ముందే చిన్నారిని కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.