Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కెనడాలో తెలంగాణ విద్యార్థి బలవన్మరణం

Written By ఠాగూర్
Updated: గురువారం, 1 ఏప్రియల్ 2021 (14:03 IST)
కెనడాలో ఓ తెలంగాణ‌ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లాలోని డిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్‌ రావు అనే విద్యార్థి ఉన్నత చదువుల కోసం ఆరేళ్ల క్రితం కెనడా వెళ్లాడు. అయితే, ఏం క‌ష్టం వ‌చ్చిందో.. గురువారం ఉద‌యం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
ఆయ‌న ఆత్మహత్యకు గ‌ల‌ కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్ర‌వీణ్ కుమార్ తల్లితండ్రుల పేర్లు నారాయణరావు, హైమావతి. వారి సాధారణ రైతు కుటుంబం. 
 
ఉన్నత ఆశయాలతో త‌మ కుమారుడు కెన‌డాకు వెళ్లి చ‌దువుకుంటున్నాడ‌ని వారు చెప్పారు. క‌ల‌ను నెర‌వేర్చుకోవాల‌నుకున్న కుమారుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడంటూ వారు విల‌పించారు. ప్ర‌వీణ్ కుమార్ మృతిపై వారు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలికి వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, తమ కుమారుడి మృతేదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మృతుని తల్లిదండ్రులు కోరుతున్నారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments