శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 జులై 2021 (15:03 IST)

బావిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృత్యువాత

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బావి నలుగురు వ్యక్తులను మింగేసింది. జిల్లాలోని నముల్కనూరు శివారులో ఓ కారు అదుపు తప్పి వ్యాసాయ బావిలోకి దూసుకెళ్ళింది. కారు పూర్తిగా ఆ వ్యవసాయ బావిలోకి మునిగిపోయింది. 
 
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కారుని బావి నుంచి వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కారులో ఉన్న వ్యక్తులు నలుగురు మృత్యువాతపడ్డారు.
 
దీంతో వారిని వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ దారుణ ప్రమాదం కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్తుండగా చినముల్కనూరు శివారులో చోటుచేసుకుంది. కారులో ఉన్నవారి వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.