బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 29 జులై 2021 (14:22 IST)

భగత్ సింగ్ నగర్ టీజర్ లో అసహనం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్

Bhagat Singh Nagar Teaser
విదార్థ్, ధృవిక హీరో,హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు నిర్మిస్తున్న చిత్రం భగత్ సింగ్ నగర్. తెలుగు, తమిళ  బాషలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా టీజర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ప్రకాష్ రాజ్ విడుదల చేశారు.
 
అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, తనపై వేసిన ఏ.వి లో నా పర్మిషన్ లేకుండా "మా అసోసియేషన్" కు పోటీ చేస్తున్న క్లిప్పింగ్ ను ప్రదర్శించినందుకు చిత్ర  దర్శకుడిపై అసహనం వ్యక్తం చేశారు  వీడియో క్లిప్పింగ్ ను తీసివేయమని కోరారు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ, నాకు భగతసింగ్ అంటే ఎంతో ఇష్టం.ఆయన పోరాట పటిమ నాకిష్టం. ఈ దేశమే భగతసింగ్ దేశం అయితే ఎంత బాగుండేదో అనుకునేవాన్ని. ఆయన ఉంటే ఈ దేశం ఇప్పుడు ఎక్కడ ఉండేదో.భగతసింగ్ ఉంటే చెగువేరా అంతటి వార‌య్యేవారు.
 
చెగువేరా క్యూబా లో పోరాటం చేసి గెలిచిన తరువాత ఇప్పుడు నేను కాలీగా ఉన్నానే, ప్రపంచంలో ఎక్కడైనా పోరాటం జరుగుతుంటే అక్కడికెళ్తాను వారికి నా అవసరం ఉంటుంది అనేటటువంటి గొప్ప వ్యక్తి ఆయన.దేశంతో పని లేకుండా సాటి మనిషి ఏమైనా జరిగితే స్పందించే వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి మంచి ఆలోచనతో సినిమా తీస్తున్నారని తెలియగానే పిలిచి మాట్లాడాను. దర్శకుడు క్రాంతి  మంచి కథను సెలెక్ట్ చేసుకొన్నాడు.ఎంతోమంది గురువులు వున్నా నాకంటూ ఒక గుర్తింపు రావాలి, మన అలోచలను మన చుట్టూ వున్న కథల్ని మన భగతసింగ్ లాంటి వారిని మళ్లీ పరిచయం చేయాలనే గొప్ప ఆలోచనతో వస్తున్న ఇలాంటి యువకుల ఆలోచనలను,ఇలాంటి ప్రయత్నం చేస్తున్న దర్శకులకు మనమంతా సపోర్ట్ చేస్తే సమాజం మెరుగుపడే చిత్రాలు వస్తాయి. ఇలాంటి మంచి సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలను చూసి నేను గర్వపడుతున్నాను అని అన్నారు. 
 
దర్శకుడు బాబ్జి  మాట్లాడుతూ, ఇది క్రాంతి కల కాదు ఇది వారి తండ్రి మునిచంద్ర కల, ఒక తండ్రి కల ,ఒక తల్లి కలను తనయులు తీరుస్తున్నారు.ఇది ఈ సినిమా గొప్పతనం మనమందరికీ పండుగలు తెలుసు ఏదైనా పండుగ వస్తే వారు భక్తికి కోసం ఉపవాసాలు ఉంటారు కొందరు ఆరోగ్య సమస్యలు బాగవ్వాలని ఉపవాసాలు ఉంటారు కొందరు. కానీ భ‌గ‌త్‌సింగ్ చ‌నిపోయిన‌ మార్చి 23వ ఈ కుటుంబమంతా ఉపవాసం ఉంటుంది.ఇంత గొప్ప దేశభక్తి ఉన్న గ్రేట్ ఫ్యామిలీ. ఇలాంటి గొప్ప ఆలోచనలతో ఈ కుటుంబం నుండి "భగత్ సింగ్" ఆలోచనలతో వచ్చిన దర్శకుడే క్రాంతి. ఇందులో హీరోగా వారి తమ్ముడు విదార్థ్ నటిస్తున్నాడు, వారి తల్లి,తండ్రులు ఈ సినిమాకు నిర్మాతలు.ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఉన్న తను ప్రజానాట్యమండలి లో నాటకాలు వేసుకొంటూ పాటలు పాడి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని ఏ రోజు కైనా సినిమాలలోకి వెళ్ళాలని మంచి ఉద్దేశ్యంతో సినిమా తీశారు. ఆద‌రించాల‌ని వేడుకొంటున్నానని అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ, భగత్ సింగ్ నగర్ లో జరిగే ఒక సంఘటన ఆధారంగా తీసిన అందమైన ప్రేమకథ. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. మాకు సపోర్ట్ చేసిన బెనర్జీ కు ధన్యవాదాలు అన్నారు. .
 
ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ప్రభాకర్ దమ్ముగారి, దర్శకుడు వీరభద్రం, చిన్ని కృష్ణ, దర్శకుడు చంద్ర మహేష్, నిర్మాత శ్రీకాంత్, బట్టల రామస్వామి నిర్మాత సతీష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెలిదొండ వెంకటేష్ ,యూసుఫ్ గూడ ఎక్స్ కార్పొరేటర్ సంతోష్, చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.