తెలంగాణలో కలెక్టర్ పేరు మార్పు?
తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల ప్రధాన అధికారులుగా ఉన్న కలెక్టర్‌ల (కలెక్టర్) పేరును మార్చనున్నారా..? అంటే మంత్రివర్గ సభ్యుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తుంది.
మంగళవారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన కలెక్టర్‌లతో సమావేశంలో ఇదే అంశంపై కేసీఆర్ చర్చించారు. కలెక్టర్ అనే పేరు బదులు మరోపేరును అతి త్వరలో సూచించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. అదే సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కలెక్టర్ అనే పదాన్ని బ్రిటీష్ పాలకులు పెట్టిందని, నాడు పన్నులను వసూలు చేసేవారిని కలెక్టర్‌లుగా బ్రిటీష్ పాలకులు పిలుచుకునేవారంటూ గతాన్ని గుర్తు చేశారు.
ప్రస్తుతం పన్నులను వారు వసూలు చేయడం లేదు కనుక కలెక్టర్ అన్న పేరును కొనసాగించడం సరికాదని, కలెక్టర్ అన్న పేరును మార్చేందుకు నిర్ణయించామని కేసీఆర్ పేర్కొన్నారు.