శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2019 (08:08 IST)

తుగ్లక్ లా జగన్ పాలన...సీపీఐ

తుగ్లక్ పాలనలా జగన్ పాలన వుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... "రాష్ట్రంలో ఇసుక కొరతతో భవన కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సెప్టెంబర్ 5 నుంచి రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీ వస్తుంది అని మంత్రి చెప్పారు. సీఎం రాష్ట్రంలో లేని సమయంలో మంత్రి రాజధాని పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు.

ఇసుక ధరలు తగ్గించాలని కోరాము. రాజధాని కోసం రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారు. ఇంత ప్రజాధనం వృధా చేయటం కరెక్టు కాదు. ఇక్కడే రాజధాని ఉంటుందని భావిస్తున్నాము. రాజధాని మార్చితే జగన్ తుగ్లక్ పాలన అనిపిస్తుంది. అటువంటి నిర్ణయం సీఎం తీసుకోరు అనుకుంటున్నాము" అని పేర్కొన్నారు. 
 
మరో వైపు విజయవాడ ఎంపీ, టీడీపీ ఎంపీ కేశినేని నాని... జగన్ ను తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. తుగ్లక్ లా చరిత్రకు ఎక్కకూడదంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. "వైఎస్ జగన్ రెడ్డి గారు... చిన్నప్పుడు మొహ్మద్ బీన్ తుగ్లక్ తుగ్లక్ గురించి చరిత్ర పుస్తకాల్లో చదివాము.

1328లో ఢిల్లీ నుండి రాజధానిని మహారాష్ట్ర దౌలతాబాద్ కు,  అక్కడ నుండి తిరిగి ఢిల్లీకి మార్చిన వైనం. మీరు ఆ తుగ్లక్ లాగా చరిత్ర ఎక్కకుడదని భగవంతుడిని కోరుకుంటున్నా" అని పేర్కొన్నారు.