మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : మంగళవారం, 11 జూన్ 2019 (16:40 IST)

జగన్ రోజాకు మంత్రివర్గంలో స్థానం కల్పించి వుంటే బాగుండేది: రాములమ్మ

''సినీ రంగానికి చెందిన ఎమ్మెల్యే రోజా కూడా జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సినీ రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలు వినియోగించుకుని, వారికి కూడా తగిన గుర్తింపు ఇస్తే బాగుంటుందని  నేను చెప్పదలుచుకున్నాను. రాబోయే రోజుల్లో నైనా జగన్ గారు రోజా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను'' అంటూ రాములమ్మ విజయశాంతి ట్విట్టర్‌లో తెలిపారు. 
 
అంతేగాకుండా.. జగన్మోహన్ రెడ్డి గారు తన మంత్రివర్గంలో మహిళలకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోంశాఖను కేటాయించడం మీద జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కనీసం దీనిని చూసిన తర్వాత అయినా కేసీఆర్ గారు మహిళలకు తన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా? లేక గత ఐదేళ్ల కాలంలో మహిళా మంత్రులకు స్థానం ఇవ్వకుండా కేబినెట్లో కొనసాగించిన పరిస్థితి మళ్లీ పునరావృతం అవుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.  
 
ఈ సందర్భంగా ఏ. పి.క్యాబినెట్ కూర్పుపై కూడా నా అభిప్రాయాన్ని తెలియజేయాలి అనుకుంటున్నాను. మిగిలిన మహిళలకు అవకాశాలు కల్పించడంతో పాటు... సినీ రంగానికి చెందిన రోజాకు మంత్రివర్గంలో స్థానం కల్పించి వుంటే బాగుండేదన్నారు.