Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనం ఒకరి ప్రాణం తీసింది.. పెట్రోల్ పోసి నిప్పంటించుకుని..?

Written By సెల్వి
Updated: గురువారం, 23 డిశెంబరు 2021 (13:34 IST)
సహజీవనం ఒకరి ప్రాణం తీసింది. హైదరాబాద్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  ఓ ఆసుపత్రిలో పనిచేసే వెంకటలక్ష్మికి వెల్డింగ్ దుకాణంలో పనిచేసే వెంకటేష్‌(55)తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. 
 
ఇక లక్ష్మికి భర్త పదేళ్ల కిందనే మరణించాడు ఆమెకు ఒక కూతురు, కొడుకు ఉండగా, కూతురికి పెళ్లి చేసింది. వెంకటేష్‌ భార్య చనిపోయింది. ఇతనికి ఒక కొడుకు ఉన్నాడు. ఇద్దరికీ భార్య, భర్త లేకపోవడంతో వీరు కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వీరి మధ్య ప్రేమ పెరిగింది.
 
ఈ క్రమంలో ఏమైందో తెలియదు కానీ వెంకటేష్ ప్రవర్తనలో కాస్త మార్పు వచ్చింది. చాలా రోజుల నుంచి సహజీవనం చేస్తున్న లక్ష్మి దూరం పెట్టడంతో వెంకటేష్ మానసికంగా కుంగిపోయాడు. ఆమె ఎడబాటు తట్టుకోలేక వెంకటేష్ ఏకంగా ఓ రోజు రాత్రి కూకట్ పల్లి లోని లక్ష్మి నివాసానికి వెళ్లారు. దీంతో అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 
 
అనంతరం వారు ఉన్న గుడిసెలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఇద్దరూ కాలిన గాయాలతో కనిపించడంతో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తనతో ఉండటానికి లక్ష్మి ఒప్పుకోలేదని వెంకటేష్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ చూడండి

Rukmini Vasanth: లేడీ ఓరియెంట్ కథతో మాలాశ్రీ, రుక్మిణి వసంత్ చిత్రం మంగళ గౌరీ

Mani Sharma :క్రేజీ చిత్రం లీసా లోకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఎంట్రీ

Sree Vishnu: ఫ్యామిలీ ప్యాక్ తో సంక్రాంతి పోటీగా రాబోతున్న శ్రీ విష్ణు

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీకల్పం వేడుకను పాటించిన సమంత

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

తర్వాతి కథనం
Show comments