మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (09:22 IST)

ఫిబ్రవరిలో మేడారం జాతర - సిద్ధమవుతున్న ఆర్టీసీ

తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద పండుగల్లో మేడారం జాతర ఒకటి. వచ్చే యేడాది ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరుగనుంది. ఈ జాతర కోసం దాదాపు 21 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా. దీంతో ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమవుతుంది. ఇందుకోసం ఏకంగా 3845 ఆర్టీసీ బస్సులను నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఒక్క వరంగల్ రీజియన్ నుంచి ఏకంగా 2250 బస్సులు నడుపనున్నారు. 
 
అంతేకాకుండా, రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు ఏపీలోని పలు జిల్లాల నుంచి కూడా ఈ బస్సులను నడుపనున్నారు. అయితే, హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఏసీ బస్సులను నడుపనున్నారు. మేడారం జాతర కోసం నడిపే బస్సులను పార్కింగ్ చేసేందుకు వీలుగా 50 ఎకరాల్లో భారీ బస్టాండును నిర్మిస్తున్నారు. అలాగే, ప్రయాణికులు రద్దీ లేకుండా ఉండేందుకు వీలుగా భారీ సంఖ్యలో టిక్కెట్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం పనులను బుధవారం నుంచి ప్రారంభించారు.