బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (19:17 IST)

శబరిమల భక్తులకు ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ తీపి కబురు

శబరిమల భక్తులకు ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ సంస్థ తీపి కబురు చెప్పింది. విశాఖపట్నం నుండి అయ్యప్ప స్వామి సన్నిధి శబరిమలకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీస్‌లు నిర్వహించాలని విజయనగరం జోన్ ఈడీ సీహెచ్ రవి కుమార్ పేర్కొన్నారు. 
 
విశాఖ జోన్ నుండి 60 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసినట్లు సీహెచ్ రవి కుమార్ స్పష్టం చేశారు. విశాఖ రీజియన్ నుండి 25 బస్సు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
 
కార్తీక మాసం ఈ సందర్భంగా పిక్నిక్‌లకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అరకు, లమ్మ సింగి, ధారకొండ ప్రాంతాలకు కూడా టూరిస్ట్ సర్వీస్ లు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. 
 
ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. కాగా ప్రస్తుతం శబరిమల ఆలయంలో దర్శనాలు చాలా తక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. కరోనా నిబంధలను పాటిస్తూనే.. దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు ఆలయ అధికారులు.