హైదరాబాద్ నగరంలో షీ షటిల్ బస్సులు - మహిళలకు ఉచిత ప్రయాణం

శనివారం, 18 మార్చి 2023 (16:35 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని హైదరాబాద్ నగరంలో షీ షటిల్ బస్సులను నడుపనుంది. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. శుక్రవారం రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటరులో జరిగిన ఉమెన్స్ కాంక్లేవ్ అండ్ అవార్డుల కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో షీ షటిల్ బస్సును తయారు చేశారన్నారు. మహిళలకు అన్ని సౌకర్యాలు ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. భద్రత కోసం బస్సులో ఓ సెక్యూరిటీ గార్డును కూడా ఉంటారని చెప్పారు. 
 
సైబరాబాద్ పోలీస్ అండే సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఎస్సీఎస్సీ సెక్రటరీ కృష్ణ ఏదుల వంటి అనేక మంది ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

అన్నీ చూడండి

Shalini: సింగ్ గీతం లో విలన్ క్యారెక్టర్ చేశాను. మాటే పాటగా మారే కథ ఇది : శాలిని కొండెపుడి

Sunitha: భానుచందర్, సునీత, సి కళ్యాణ్ ఆవిష్కరించిన కొత్త మలుపు ట్రైలర్

SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి మ్యూజిక్ కు వరల్డ్ రికార్డ్ గుర్తింపు దక్కింది

Janhvi Kapoor : సినిమా అనేది ప్రజలకు చేసే సేవ : జాన్వీ కపూర్

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ చిత్రం ఇరుముడి గ్లింప్స్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments