మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: శనివారం, 18 జులై 2020 (17:15 IST)

కరోనావైరస్ చికిత్సకు మందుల కొరత లేకుండా చూడండి: మంత్రి ఈటెల

తెలుగు రాష్ట్రంలో కరోనా శరవేగంలో విస్తరిస్తున్నది. దీనిని అదుపు చేయడానికి ప్రభుత్వం పగడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. కరోనావైరస్ వ్యాధిని నియంత్రించేందుకు సీఎం కేసీఆర్ రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. దీనికితోడు పలుచోట్ల కరోనా పరీక్ష కేంద్రాలను విస్తృత పరిచింది. ఈ క్రమంలో తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ అధికారులతో ఇప్పటివరకు ఎన్నో సమీక్షలు నిర్వహించారు.
 
ఈ సమీక్షలో కరోనా మహమ్మారి బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, వైరస్ బారిన పడిన వారికి అందించే వైద్యం గురించి పలు చర్చలు జరిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు దావాఖానాల్లో మందుల కొరతపై సమీక్ష నిర్వహించారు. శనివారం ఆయన నిర్వహించిన సమావేశంలో ఫార్మా డీలర్లు, అధికారులు హాజరయ్యారు. అందులో విటమిన్ డి, సి, మల్టి విటమిన్, జింక్ వంటి ఔషధాలను మందుల దుకాణాలలో అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.
 
కరోనా చికిత్స కోసం ఉపయోగించే డాక్సామెతాసోన్, మిథైల్‌ప్రెడ్నిసోలాన్, అజిత్రోమైసిన్, డాక్సీసైకిన్ వంటి మందులు వీలైనంత తొందరగా సరఫరా చేయాలని కోరారు. ఇందులో జాప్యం వహించరాదని సూచించారు. అదేవిధంగా కరోనా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని తెలిపారు.