Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో షాక్ కొడుతున్న విద్యుత్ చార్జీలు

Written By ఠాగూర్
Updated: బుధవారం, 2 మార్చి 2022 (17:32 IST)
తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు షాక్ కొడుతున్నాయి. విద్యుత్ వినియోగంలో ఏమాత్రం తేడా లేకపోయినప్పటికీ విద్యుత్ బిల్లుల్లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. దీంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. యూజర్ డెవలప్‌మెంట్ చార్జీల పేరుతో ఈ బాదుడుకు తెరతీశారు. 
 
దీంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వందలు, వేలాది రూపాయల్లో వచ్చే బిల్లులు చెల్లించలేక బోరుమంటున్నారు. ఈ పరిస్థితి నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. దీంతో విద్యుత్ బిల్లుల బాడుదు అంశం ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిగ్గా మారింది. 
 
గతంలో రూ.200 లేదా రూ.300 వచ్చే కరెంట్ బిల్లు ఇపుడు ఏకంగా రూ.4 వేలు వచ్చిన బిల్లులు చూసి వినియోగదారుల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఈ బాదుడు ఏంటని వారు విద్యుత్ శాఖ అధికారులను నిలదీస్తున్నారు. విద్యుత్ బిల్లులతో కరెంట్ ఆఫీసలకు పరుగులు తీస్తున్నారు. పరిమిత యూనిట్స్‌తో కూడిన విద్యుత్ వాడినప్పటికీ బిల్లులు మాత్రం వేలల్లో రావడంతో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments