మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 జులై 2021 (16:36 IST)

చంపేందు ప్లాన్ చేస్తున్నారు : అరె కొడుకుల్లారా ఖబర్దార్..? ఈటల వార్నింగ్

తనను హత్య చేసేందుకు కొందరు ప్లాన్ చేస్తున్నారంటూ మాజీ మంత్రి, ఈటల రాజేందర్ ఆరోపించారు. పైగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రజాకార్లను తలపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఆయన సోమవారం నుంచి ‘ప్రజా జీవన యాత్ర’ పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా శనిగరంలో ఏర్పాటు చేసిన సభలో ఈటల మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలోని సర్పంచ్‌లకు సీఎం వెలకట్టారని, ఈ విషయం తనకు తెలుసున్నారు. 
 
పైగా, తనను చంపడానికి జిల్లా మంత్రి కుట్రలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. హంతక ముఠాలతో చేతులు కలిపినట్లు తనకు సమాచారం వచ్చిందన్నారు. ‘అరె కొడుకుల్లారా ఖబర్దార్..? నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదు.. మీ చిల్లర ప్రయత్నాలకు అసలు భయపడనని ప్రకటించారు. 
 
పైగా, ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని, ఈటల మల్లయ్య కొడుకుని ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతా.. దుబ్బాకలో ఎం జరిగిందో అదే ఇక్కడ కూడా జరుగుతుంది. 2018లో నన్ను ఓడించడానికి ఎన్ని కుట్రలు చేసినా నా ప్రజలు అండగా నిలిచారు. ఇప్పుడు నిలుస్తారు. చట్టం మీద నాకు విశ్వాసం ఉంది.. పోలీసులు సహకరించండి’’ అంటూ ఈటల రాజేందర్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 
 
ఓడిపోతామనే భయంతోనే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాము మధ్యాహ్న భోజనం కోసం ఓ రైస్ మిల్లులో ఏర్పాట్లు తీసుకుంటుంటే రైస్ మిల్ యజమానులను భయపెట్టి తమ వంట సరుకులను సీజ్ చేశారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఇక దళిత బందు పథకం పెట్టడం సంతోషమే అని వ్యాఖ్యానించిన ఈటల… దళితులకు ఇస్తామన్న 3 ఎకరాల ఏక్కడా అని ప్రశ్నించారు. 
 
కేవలం ఎన్నికల కోసం పథకాలు తీసుకురావద్దు.. రెండేళ్లుగా ఇవ్వని పెన్షన్, రేషన్ కార్డ్ ఇస్తున్నారు. ఫాంహౌస్‌లో ఉన్న కేసీఆర్‌ను ప్రజల మధ్యకు తీసుకువచ్చింది మనమే అని ఈటల రాజేందర్ అని అన్నారు.