వరంగల్‌ జిల్లా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

బుధవారం, 2 సెప్టెంబరు 2020 (09:00 IST)
వరంగల్‌ జిల్లా దామోదర మండలంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని పసరగొండ వద్ద లారీ, కారు ఢకొీన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

మృతులు మేకల రాకేశ్‌, మేడి చందు, రోహిత్‌, సాబీర్‌, పవన్‌గా పోలీసులు గుర్తించారు. ముందు వెళ్తున్న కారును ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

పరకాల ఎసిపి శ్రీనివాస్‌ ఘటనా స్థలికి చేరుకొని సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. మృతులు వరంగల్‌ జిల్లాలోని పోచం మైదాన్‌కు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అన్నీ చూడండి

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

మొన్ననే గోవాలో కలిశాను... ఆప్యాయంగా మాట్లాడారు : భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి

తమిళ దిగ్గజ నటుడు కె.భాగ్యరాజ్య ఎలా చనిపోయారంటే...?

ఖుష్బూ సుందర్ కుమార్తె పెళ్లికి వెళ్లొచ్చారు.. గుండెపోటుతో భాగ్యరాజ్ కన్నుమూత (video)

కోలీవుడ్ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ హఠన్మరణం, మార్నింగ్ వాక్ చేసి వచ్చాక...

తర్వాతి కథనం
Show comments