తెలంగాణలో మరో ఐదు మద్యం డిపోలు

శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (08:41 IST)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నీరా విధానం గురించి మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అధికారులతో సమీక్షించారు. ఇప్పుడున్న మద్యం డిపోలకు మరో 5 అదనంగా ఏర్పాటు చేసేందుకు తగిన స్థలాలను ఎంపిక చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ఇప్పుడున్న మద్యం డిపోలకు మరో ఐదు అదనంగా ఏర్పాటు చేసేందుకు తగిన స్థలాలను ఎంపిక చేయాలని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నీరా విధానం గురించి రవీంద్రభారతిలోని మంత్రి కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. సేకరణ, నిల్వ, మార్కెటింగ్‌లతో పాటు నీరా కేఫ్‌ తదితర అంశాలపై చర్చించారు.

ఇప్పుడున్న మద్యం డిపోల నుంచి దుకాణాలకు చేరవేత కొంత ఇబ్బందిగా ఉందన్నారు. కొన్ని చోట్ల దూరం ఎక్కువ కావడంతో ఆలస్యం అవుతున్నందున కొత్తగా మరో ఐదు డిపోలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌ నగర శివారులో మూడు, సూర్యాపేటలో ఒకటి, మంచిర్యాల ప్రాంతంలో మరొకటి ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

అన్నీ చూడండి

దత్తాత్రేయ స్వామి గుడిలో పెద్ది కథను రాసుకున్నా: బుజ్జిబాబు సానా

ప్రకృతి గొప్పతనాన్ని తెలియజెప్పే కాన్సెప్ట్ తో జంగిల్ బుగి రియాల్టీ షో

విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ (Video)

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సమ్మర్ హాలిడేస్

Prasanth Varma: తేజ సజ్జ హనుమాన్ చిత్రం 3డిలో రీరిలీజ్ కాబోతోంది

తర్వాతి కథనం
Show comments