Daily Horoscope
✕

చల్లటి కబురు... తెలంగాణాలో రెండు రోజులు పాటు వర్షాలు

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (16:23 IST)
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 
 
ముఖ్యంగా, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. 
 
మరోవైపు, మండుటెండలతో తల్లడిల్లిపోతున్న రాష్ట్ర ప్రజలకు ఈ వార్త ఎంతో ఉపశమనం కలిగించేలా ఉంది. మరోవైపు, హైదరాబాద్ నగరంలో మంగళవారం ఎండలు మండిపోయాయి. ఎల్బీ నగరులో అత్యధికంగా 40.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం నగర వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

అన్నీ చూడండి

Suriya: సీన్ చిత్రంలో మిస్టరీ, మ్యాడ్‌నెస్, నవ్వులు అన్నీ ఉంటాయి : హీరో సూర్య

Mahesh Babu in Shotgun games: ప్రాజెక్ట్ టేక్‌డౌన్ కోసం షార్ట్‌గన్ గేమ్స్‌లో మహేష్ బాబు పెట్టుబడి

Poonam Kaur: త్రివిక్రమ్‌ను నకిలీ గురువు అంటూ ఏకేసిన పూనమ్ కౌర్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లకు అడ్డుకట్ట వేయాలని కోరిన మెగాస్టార్ చిరంజీవి

Rashmika: రష్మిక మైసా నుంచి మహిళా శక్తిని చాటే పవర్‌ఫుల్ ఆంథమ్‌ ఓ మైసా రే రిలీజ్

తర్వాతి కథనం
Show comments