ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (09:48 IST)

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ సీజ్

హైదరాబాద్ నగరంలోని శ్రీ రాజీవ్ గాంధీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తాజాగా భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. సొమాలియా దేశానికి చెందిన ఓ ప్రయాణికుడి వద్ద ఈ మొత్తాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
మహమూద్ అలీ అనే సోమాలియన్ అనే సొమాలియన్ దేశస్థుడు హైదరాబాద్ నుంచి షార్జాకు వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. ఆయన తన వద్ద ఉన్న అమెరికా డాలర్లను లగేజీ బ్యాగులో దాచి తరలించేందుకు ప్రయత్నించాడు. 
 
అయితే, కష్టమ్స్ అధికారులు ఆయన వాలకాన్ని సందేహించి, లగేజీ బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో రూ.30 లక్షల విలువ చేసే అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ సొమ్మును అధికారులు సీజ్ చేశారు. మహమ్మద్ అలీని అదుపులోకి తీసుకుని అతనిపై ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.