Daily Horoscope
✕

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ సీజ్

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (09:48 IST)
హైదరాబాద్ నగరంలోని శ్రీ రాజీవ్ గాంధీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తాజాగా భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. సొమాలియా దేశానికి చెందిన ఓ ప్రయాణికుడి వద్ద ఈ మొత్తాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
మహమూద్ అలీ అనే సోమాలియన్ అనే సొమాలియన్ దేశస్థుడు హైదరాబాద్ నుంచి షార్జాకు వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. ఆయన తన వద్ద ఉన్న అమెరికా డాలర్లను లగేజీ బ్యాగులో దాచి తరలించేందుకు ప్రయత్నించాడు. 
 
అయితే, కష్టమ్స్ అధికారులు ఆయన వాలకాన్ని సందేహించి, లగేజీ బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో రూ.30 లక్షల విలువ చేసే అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ సొమ్మును అధికారులు సీజ్ చేశారు. మహమ్మద్ అలీని అదుపులోకి తీసుకుని అతనిపై ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

అన్నీ చూడండి

అల్తాఫ్ హసన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న రాజిగాడు రాజయ్యాడు సిద్ధం

AR Rehman: ప్రభుదేవా, ఏ.ఆర్. రెహమాన్‌ నటించిన మూన్ వాక్ క్రిస్మస్ విడుదలకు సిద్ధం

ది సెస్సో ట్రైలర్ ఆకట్టుకుంది సినిమా కూడా వుంటుంది :ఆకాష్ జగన్నాథ్

Engagement Teja Sajja : తాజ్ కృష్ణా హోటల్‌లో మౌర్య, తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్ వేడుక

Ali: మన డాక్టర్ బాబే ప్రీమియర్లుకు ఆదరణ, థియేటర్లలోనూ విజయం దక్కుతుంది : అలీ, రాజ్ తరుణ్

తర్వాతి కథనం
Show comments