రూ. 2 వేలు చెక్కును రూ. 12 వేలుగా మార్చిన మాజీ భార్య... ఆ తర్వాత...

మెహదీపట్నం పద్మనాభనగర్ కాలనీకి చెందిన గణపతి (46) శ్రీదేవి(38)లకు 1998లో వివాహం జరిగింది. కుటుంబ కలహాలు కారణంగా 2007లో విడాకులు తీసుకున్నారు. భార్యకు భరణంగా రూ. 4 వేలు ప్రతినెలా ఇవ్వాలని భర్తకు న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2008లో గణపతి తండ్రి ఆస్పత్

మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (16:47 IST)
మెహదీపట్నం పద్మనాభనగర్ కాలనీకి చెందిన గణపతి (46) శ్రీదేవి(38)లకు 1998లో వివాహం జరిగింది. కుటుంబ కలహాలు కారణంగా 2007లో  విడాకులు తీసుకున్నారు. భార్యకు భరణంగా రూ. 4 వేలు ప్రతినెలా ఇవ్వాలని భర్తకు న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2008లో గణపతి తండ్రి  ఆస్పత్రిలో ఉండటంతో డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో రూ. 4 వేలకు బదులుగా రూ. 2 వేలు చెక్కు ఇచ్చారు గణపతి.
 
దాంతో ఆ 2 వేలు చెక్కుకు ముందు 1 పెట్టి రూ.12 వేలు డ్రా చేసింది శ్రీదేవి. బ్యాంకు స్టేట్మెంట్ చూసిన గణపతి 2008లో లంగర్ హౌస్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అప్పటి ఎస్.ఐ సంతోష్ కుమార్ ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జిషీలు దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ  చేపట్టిన అనంతరం 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ హరీష్ మోసానికి పాల్పడిన భార్య శ్రేదేవికి మూడు సంవత్సరాల కారాగార శిక్ష. 35 వేలు జరిమానా విధించారు. ఈ కేసు విచారణకు పదేళ్లు పట్టింది. 

అన్నీ చూడండి

వానలో మిల్కీ బ్యూటీ తమన్నా వణికిపోతుంటే 11 లక్షల మంది చూసారు, వీడియో

హూర్‌తో కశ్మీర్ సంగీత వారసత్వాన్ని మనముందుకు తీసుకువస్తున్న కోక్ స్టూడియో భారత్ సీజన్ 4

Suman: మూఢనమ్మకాలను ఎండగట్టే కథతో నిమ్మకాయ.. నీకెందుకు భయం చిత్రం

Mupapa: ఆయుష్మాన్ ఖురానా చిత్రం ముపాపా రిలీజ్ డేట్ ఖరారు

Rana: అమీర్ లోగ్ ను రిలీజ్ చేయబోతోన్న రానా స్పిరిట్ మీడియా

తర్వాతి కథనం
Show comments