ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (10:11 IST)

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురి దుర్మరణం

road accident
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని ముప్కాల్ వద్ద వేగంగా వెళుతున్న కారు ఒకటి అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ఉన్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.