శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 జులై 2022 (16:02 IST)

ప్రేమించలేదనీ బీరు సీసాతో యువతి దాడి... ఎక్కడ?

murderer
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తనును ఓ యువతి ప్రేమించలేదన్న అక్కసుతో ఓ ప్రేమోన్మాది బీరు బాటిల్‌తో ఆ యువతిపై దాడి చేశాడు. దీంతో ఆ యువతి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 
 
పోలీసుల కథనం మేరకు... నిజామాబాద్ పట్టణానికి చెందిన సంజయ్ అనే యువకుడికి రెండేళ్ల క్రితం ఓ వివాహ వేడుకలో ప్రియాంక అనే యువతి పరిచయమైంది. పైగా, ఈ యువకుడికి ఆ యువతి దూరపు బంధువు కూడా. అప్పటి నుంచి తనను ప్రేమించాలని ఆ యువతిని సంజయ్ వేధిస్తున్నారు. 
 
ఈ క్రమంలో శనివారం ఆ యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన సంజయ్.. ఆమె వద్దకు వెళ్లి మరోమారు తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. దీనికి ఆమె నిరాకరించడంతో ఆగ్రహోద్రుక్తుడైన సంజయ్.. ఆమెపై బీరు బాటిల్‌తో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడటంతో ఆ యువతి తీవ్ర రక్తస్రావంతో అక్కడే కుప్పకూలిపోయింది. ఇరుగుపొరుగువారు అంబులెన్స్‌ను రప్పించి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మోపాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.