ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 నవంబరు 2023 (11:27 IST)

లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి

lift
లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. నూతన భవనంలో లిఫ్ట్‌లో ఇరుక్కొని అక్షయ్ కుమార్(4) అనే బాలుడు మృతి చెందాడు. 
 
గత 20 రోజులుగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నాగరాజు, అనురాధల కొడుకు అక్షయ్. లిఫ్ట్ సరిగ్గా పనిచేయకపోవడంతో బాలుడు అందులో ఇరుక్కుపోయాడు. 
 
దీన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.