శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: గురువారం, 10 సెప్టెంబరు 2020 (17:52 IST)

మెడికల్ కాలేజ్ సిబ్బందికి గుడ్ న్యూస్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బోధనాసుపత్రిలో విధులు నిర్వహించే సిబ్బందికి జీతాలను పెంచుతూ ఉకత్తర్వులు జారీచేసింది. బోధనా సిబ్బందికి జీతాలు పెంచాలనే నిర్ణయం గత నాలుగున్నర సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండిపోయింది. అయితే కొన్ని రోజులు క్రితమే గాంధీ ఆసుపత్రి వైద్యులు, అలాగే ఇతర సిబ్బంది కూడా తమ జీతాలు పెంచాలనే డిమాండుతో సమ్మెలో దిగారు.
 
కాగా వారి డిమాండ్లను పరిగణలోనికి తీసుకున్న ప్రభుత్వం వారి జీతాలను 24 శాతం నుంచి 44 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ బోధనాసుపత్రిలో సుమారు 2,860 మంది అధ్యాపకులు ఉండగా వీరందరి వేతనాలు పెరిగాయి. ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ స్పందించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పే రివిజన్ అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గురువారం ఉత్తర్వులు ప్రకారం పెరిగిన జీతాలు ఈ నెల నుండి నగదు రూపంలో చెల్లించబడుతాయి. జీతాల వివరాలు... అసిస్టెంట్ ప్రొఫెసర్ 67,000 నుంచి 90, 000, అసోసియేట్ ప్రొఫెసర్ 80,000 నుంచి 1,00,000, ప్రొఫెసర్ 1,25,000 నుంచి 1,80,000గా పెరిగింది.