Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

భాగ్యనగరిలో అర్థరాత్రి కుమ్మేసిన వర్షం

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 26 జులై 2022 (08:33 IST)
హైదరాబాద్ నగరంలో సోమవారం అర్థరాత్రి వర్షం కుమ్మేసింది. దీంతో అనేక ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గత అర్థరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. 
 
దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. విధులు ముగించుకుని ఆ సమయంలో తమ ఇళ్లకు పయనమైనవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 
 
ప్రధానంగా ఖైరతాబాద్, నాంపల్లి, బంజారాహిల్స్, కోఠి, పాతబస్తీ, అబిడ్స్, మలక్‌పేట, దిల్‌సుఖ్ నగర్, ముషీరాబాద్, కాప్రా, హిమాయత్ నగర్, తదితర ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. 
 
కోఠిలోని ఓ రహదారిపై ప్రవహించిన వరద నీటిలో ఓ ద్విచక్రవాహనదారుడు కొట్టుకునిపోయాడు. మలక్ పేట వంతెన దిగువున నడుము లోతులో నీరు చేరిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఎల్బీ నగర్ పరిధిలో చింతల్‌కుంట జాతీయ రహదారిపైనా మోకాళ్ళలోతులో నీర నిలిచింది. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments