హైదరాబాద్‌లో దంచి కొడుతున్న భారీ వర్షం

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (19:10 IST)
హైదరాబాద్ నగరంలో మంగళవారం వర్షం దంచికొడుతోంది. స్థానిక వాతావరణ కేంద్రం హెచ్చరించిన మేరకు ఈ నెల 8వ తేదీ వరకు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇందులోభాగంగా, మంగళవారం మధ్యాహ్నం నుంచి భాగ్యనగరిలో వర్షం దంచికొడుతోంది. 
 
ముఖ్యంగా, జూబ్లీహిల్స్, దిల్‌ సుఖ్ నగర్, హైదర్ నగర్, రాంనగర్, అంబర్ పేట్, ప్యాట్నీ సెంటర్, బంజారాహిల్స్, ఆల్విన్ కాలనీ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఎల్బీ నగర్, మలక్ పేట, సికింద్రాబాదు, లక్డీకాపూల్, కూకట్ పల్లి, అమీర్ పేట, వనస్థలిపురం, బోయిన్ పల్లి, బేగంపేట, పంజాగుట్ట, సోమాజిగూడ, ఓయూ, నిజాంపేట, చిలకలగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదుకాగా, కొన్ని ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురిశాయి. 
 
మరోవైపు, ఈ వర్షం ప్రారంభమైన కొద్దిసేపటికే అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎప్పటిలాగే రహదారులపై నీళ్లు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో వాహనదారులు రోడ్లపై ఇబ్బందులు పడుతున్నారు. 

అన్నీ చూడండి

విజయ్ నటించిన జననాయగన్‌ను తల్లితో కలిసి వీక్షించిన త్రిష

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

తర్వాతి కథనం
Show comments